ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ పై సెంచరీ చేసిన విరాట్ కోహ్లి.. ఇంటర్నేషనల్ క్రికెట్లో పలు రికార్డులు తిరగరాశాడు. వన్డేల్లో 14 వేల పరుగుల మైలురాయి దాటాడు. ఇందుకు సచిన్ 350 ఇన్నింగ్స్ లాడితే, కోహ్లికి 287 ఇన్నింగ్స్ లే అవసరమయ్యాయి. వన్డేల్లో 51వ సెంచరీని పూర్తి చేసుకోవడమే కాకుండా అంతర్జాతీయ మ్యాచుల్లో 27,503 పరుగులు చేశాడు. సచిన్(34,357), సంగక్కర(28,016) తొలి రెండు స్థానాల్లో ఉంటే విరాట్ మూడోస్థానంలో నిలిచాడు. అన్ని ఫార్మాట్లలో కోహ్లికిది 82వ సెంచరీ. ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ ల్లో పాకిస్థాన్ పై సెంచరీలు చేసిన ఆటగాడిగానూ రికార్డులకెక్కాడు.
క్యాచ్ ల్లోనూ…
పాకిస్థాన్ మ్యాచులో రెండు క్యాచ్ లు అందుకోవడం ద్వారా వన్డేల్లో అత్యధిక క్యాచ్(158)లు తీసుకున్న భారత ప్లేయర్ గా కోహ్లి రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఇది అజహరుద్దీన్(156) పేరిట ఉంది. ఇక ఓవరాల్ లిస్టులో మహేళ జయవర్ధనే(218), పాంటింగ్(160) అతడి కంటే ముందున్నారు.
వన్డేల్లో అత్యధిక పరుగుల వీరులు వీరే…
1. సచిన్ టెండూల్కర్(భారత్) – 18,426 పరుగులు(452 ఇన్నింగ్స్)
2. కుమార సంగక్కర(శ్రీలంక) – 14,234 పరుగులు(380 ఇన్నింగ్స్)
3. విరాట్ కోహ్లి(భారత్) – 14,085 పరుగులు(287 ఇన్నింగ్స్)
4. రికీ పాంటింగ్(ఆస్ట్రేలియా) – 13,704 పరుగులు(365 ఇన్నింగ్స్)
5. సనత్ జయసూర్య(శ్రీలంక) – 13,430 పరుగులు(433 ఇన్నింగ్స్)