వింబుల్డన్ ఉమెన్ సింగిల్స్ ఛాంపియన్(champion)గా చెక్ రిపబ్లిక్ ప్లేయర్ మార్కెటా వొండ్రుసోవా అవతరించింది. ఫైనల్ లో జాబెర్(ట్యునీషియా)పై 6-4, 6-4, తేడాతో విన్నర్(winner)గా నిలిచింది. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఆడిన వొండ్రుసోవా.. వింబుల్డన్ ఉమెన్ టైటిల్ గెలిచిన ఫస్ట్ అన్ సీడెడ్ ప్లేయర్ గా రికార్డు క్రియేట్ చేసింది. ఛాంపియన్ గా నిలిచిన ఆమెకు రూ.25.25 కోట్ల ప్రైజ్ మనీ దక్కగా.. రన్నరప్ జాబెర్ కు రూ.12.62 కోట్లు లభించింది. పూర్తిస్థాయి ఆధిపత్యం ప్రదర్శించిన ఈ చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి… 80 నిమిషాల్లోనే మ్యాచ్ ను ముగించింది. హోరాహోరీగా మొదలైన ఫస్ట్ సెట్ మలుపులు తిరుగుతూ రసవత్తరంగా ముగిసింది. జాబెర్ 4-2తో దూసుకెళ్లినా ఏ మాత్రం ఒత్తిడికి గురి కాకుండా వరుసగా నాలుగు గేమ్ లు నెగ్గి సెట్ ను వొండ్రుసోవా సొంతం చేసుకుంది. లీడ్ లో ఉన్న ప్రత్యర్థిని తన ఆటతీరుతోనే ప్రెజర్ కు గురిచేసి టైటిల్ విన్నర్ గా అవతరించింది.
పురుషుల ఫైనల్స్ నేడు
పురుషుల ఫైనల్స్ నేడు జరగనుండగా.. ప్రపంచ నంబర్ వన్ అల్కరాస్ తో రెండో సీడ్ జకోవిచ్ తలపడనున్నాడు. నిరుడు US ఓపెన్ నెగ్గిన అల్కరాస్ ఇప్పుడు వింబుల్డన్ పై కన్ను వేయగా.. ఇప్పటికే 23 గ్రాండ్ స్లామ్ లు నెగ్గిన జకోవిచ్ ఇప్పుడు 24 టైటిల్ కోసం ఎదురుచూస్తున్నాడు. సాయంత్రం 6:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.