
ఐపీఎల్ తొలి మ్యాచులో 47 బంతుల్లో 70.. రెండో మ్యాచులో 40 బంతుల్లో 70.. అలా ఢిల్లీని ఒంటిచేత్తో గెలిపించిన అతగాడే యూపీకి చెందిన సమీర్ రిజ్వీ. తండ్రి వద్దని చెప్పినా, మామ ప్రోత్సాహంతో క్రికెట్లో ఎదిగాడు. కోపంతో ఇంటికి కూడా రానివ్వలేదు తండ్రి. మీరఠ్ లో క్రికెట్ నేర్చుకుని లీగ్ ల్లో సత్తా చాటాడు. 2024లో రూ.8.40 కోట్లకు చెన్నై కొనుక్కున్నా 5 మ్యాచుల్లో 51 పరుగులే చేయడంతో వదిలేసింది. దీంతో నిరాశలో పడ్డ అతణ్ని ఢిల్లీ రూ.95 లక్షలకు కొనుక్కుంది. తొలి మ్యాచులోనే పంజాబ్ పై 25 బంతుల్లో 58 రన్స్ చేసి గెలిపించాడు. ఇప్పటిదాకా ఐపీఎల్ లో అతడు 15 మ్యాచులాడి 3 హాఫ్ సెంచరీలతో 330 పరుగులు చేశాడు.