జట్టు కష్టాల్లో ఉన్నా మహేంద్రసింగ్ ధోని(Dhoni) చివర్లో బ్యాటింగ్ కు రావడంపై ఫ్యాన్స్ లో అసహనం కనిపిస్తోంది. బెంగళూరుతో మ్యాచ్ లో 9వ నంబర్లో 16 బంతుల్లో 30 రన్స్ చేశాడు. అయినా 50 పరుగుల పరాజయం తప్పలేదు. నిన్న రాజస్థాన్ తోనూ ఏడో నంబర్లో దిగి 16 రన్స్ చేసినా 6 పరుగుల తేడాతో CSK ఓడింది. అతడి పరిస్థితిపై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ క్లారిటీ ఇచ్చాడు. శారీరక సమస్యల దృష్ట్యా అలాంటి నిర్ణయం తీసుకున్నామన్నారు. కీపింగ్ తో అలసిపోవడం, మోకాళ్లపై భారం వల్ల లోయర్ ఆర్డర్లో ధోని వస్తున్నాడన్నాడు. బ్యాట్ తో 10 ఓవర్లు కూడా క్రీజులో ఉండే పరిస్థితి లేదట. దీనికితోడు మిగతావాళ్లకు అవకాశం కల్పించడం కూడా సాధ్యమవుతుందన్నాడు.