
3 రోజుల భారత టూర్లో మెస్సీ ఒక్క పూర్తి మ్యాచ్ కూడా ఆడట్లేదు. ఎగ్జిబిషన్ మినహా అధికారిక మ్యాచ్ లేదు. బీమా పాలసీల్లో వరల్డ్ లోనే అత్యంత విలువైన ఆటగాడు కావటమే అందుకు కారణం. అతడి ఎడమ పాదానికి 900 మిలియన్ డాలర్ల(రూ.8,100 కోట్ల) ఇన్సూరెన్స్ ఉంది. అర్జెంటీనాతోపాటు క్లబ్ ఇంటర్ మియామీకి చెందిన మేజర్ సాకర్ లీగ్(MLS) తరఫున మాత్రమే ఆడతాడు. అయినా భారత్ లో ఏ క్లబ్ కూ మెస్సీ షెడ్యూల్ తో సంబంధం లేదు. ఎగ్జిబిషన్ మ్యాచ్ లకు బీమా వర్తించదు. ఏదైనా గాయమైతే మిలియన్ డాలర్లు నష్టపోవాల్సి ఉంటుంది కాబట్టే దూరంగా ఉన్నాడు. బాస్కెట్ బాల్ దిగ్గజ ప్లేయర్ మైఖేల్ జోర్డాన్ చికాగో బుల్స్ తో ఒప్పందం చేసుకున్నాడు. లవ్ ఆఫ్ ది గేమ్ నిబంధన ప్రకారం అనుమతి తీసుకోకుండానే అతను ఎప్పుడైనా, ఎక్కడైనా, కోరుకున్నచోట, ఎవరితోనైనా మ్యాచ్ ఆడొచ్చు. కానీ ఇలాంటి వెసులుబాటు లయోనల్ మెస్సీకి లేదు.