స్పెయిన్ చిన్నోడు కార్లోస్ అల్కరాస్(Alcaraz) వరుసగా రెండోసారి వింబుల్డన్ విజేతగా నిలిచాడు. సెర్బియా సీనియర్ నొవాక్ జకోవిచ్(Djokovic)పై వరుస సెట్లలో విజయం సాధించి టైటిల్ ఎగరేసుకుపోయాడు. కోర్టు నలుమూలలా అద్భుత సర్వ్ లతో జకోవిచ్ కు ఛాన్స్ ఇవ్వకుండా 6-2, 6-2, 7-6(4)తో మూడోసీడ్ అయిన 21 ఏళ్ల అల్కరాస్.. ఘనమైన రీతిలో టైటిల్ సాధించాడు.
నాలుగు టైటిళ్లు…
ఈ విజయంతో అల్కరాస్ ఖాతాలో నాలుగు గ్రాండ్ స్లామ్స్ చేరాయి. 2022లో US ఓపెన్ నెగ్గిన అతడు 2023, 2024 వింబుల్డన్.. 2024 ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు సాధించాడు. ఇక అతడికి ఆస్ట్రేలియన్ ఓపెన్ మాత్రమే మిగిలిపోయింది. ఈ ఓటమితో మార్గరెట్ కోర్ట్స్ 24 టైటిళ్ల రికార్డును చేరుకోలేకపోయాడు జకోవిచ్.
8 వింబుల్డన్ టైటిళ్లు సాధించిన రోజర్ ఫెదెరర్ రికార్డును సమం(Equal) చేయలేకపోయాడీ సెర్బియా ప్లేయర్. అటేమో అల్కరాస్ మాత్రం గ్రాండ్ స్లామ్ ఫైనల్ చేరిన నాలుగుసార్లూ టైటిళ్లు దక్కించుకున్నాడు.