పోలండ్(Poland)కు చెందిన ఇగా స్వైటెక్(Swaitek) వింబుల్డన్ టైటిల్ ఎగరేసుకుపోయింది. అమెరికా క్రీడాకారిణి అమండా అనిసిమోవాను ఫైనల్లో చిత్తు చేసింది. వరుసగా రెండు సెట్లు (6-0, 6-0) గెలిచి విజేతగా నిలిచింది. గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ లో ఇప్పటివరకు ఓడిపోని స్వైటెక్ ఈసారి అదే రికార్డును కాపాడుకుంది. ఇప్పటివరకు ఆమె.. నాలుగు ఫ్రెంచ్ ఓపెన్, ఒక US ఓపెన్ టైటిల్ ను ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో తుదిపోరుకు అర్హత సాధించిన ఆరు సార్లూ టైటిల్ గెలిచి తిరుగులేని రికార్డు నెలకొల్పింది. అయితే వింబుల్డన్ గెలవడం ఇదే తొలిసారి. మరిన్ని వార్తలకు క్లిక్ చేయండి… https://justpostnews.com