ఆసియా కప్ మహిళల కప్పును శ్రీలంక ఎగరేసుకుపోయింది. తొలిసారి కప్పు అందుకుని సొంతగడ్డపై తిరుగులేదనిపించింది. టాస్ గెలిచిన భారత్ తొలుత మంధాన, చివర్లో రిచా ఘోష్ విజృంభించడంతో 6 వికెట్లకు 165 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన లంక మహిళలు కూడా రెచ్చిపోయి ఆడారు. 18.4 ఓవర్లలో 167/2తో నిలిచి 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని దక్కించుకున్నారు.
షెఫాలి(16), మంధాన(60), ఉమ(9), హర్మన్(11), జెమిమా(29), రిచా(30)తో భారత్ కు మంచి స్కోరే నమోదైంది. కానీ లంక సైతం అదే రీతిలో దీటుగా జవాబిచ్చింది. గుణరత్నే(1) తొందరగానే ఔటైనా ఆటపట్టు(61), సమర విక్రమ(69 నాటౌట్) అర్థ సెంచరీలతో కవిశ(30 నాటౌట్) జట్టుకు అపురూప విజయాన్ని కట్టబెట్టారు.