బంగ్లాదేశ్ లో అంతర్గత(Internal) సంక్షోభం ఏర్పడిన వేళ అక్కడ ఈ ఏడాది జరగాల్సిన మహిళల టీ20 వరల్డ్ కప్ ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) తరలిస్తున్నట్లు ICC ప్రకటించింది. అక్టోబరు 3 నుంచి 20 వరకు జరిగే ఈ టోర్నమెంట్ UAE-బంగ్లాదేశ్ సంయుక్త భాగస్వామ్యంతో జరుగుతుంది.
బంగ్లాలో టోర్నీ నిర్వహించలేకపోవడం సిగ్గుచేటని ICC చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెఫ్ అలార్డిస్ అన్నారు. ఈ వరల్డ్ కప్ కోసం తొలుత భారత్ ను సంప్రదించినా.. ఇక్కడ వరుసగా రెండు ప్రపంచకప్ టోర్నీలు ఉండటంతో నిరాకరణ ఎదురైంది. దీంతో ఈ మ్యాచుల్ని దుబాయి, షార్జాల్లో నిర్వహించాలని నిర్ణయించారు.