భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డును తిరగరాశాడు. వరల్డ్ కప్ టోర్నీలో ఇప్పటికే అత్యధిక సిక్సర్లతో ఉన్న అతడు తాజాగా మరో రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. న్యూజిలాండ్ తో ముంబయి వాంఖడే స్టేడియంలో జరుగుతున్న సెమీఫైనల్ లో.. సిక్సర్ల రికార్డును తిరగరాశాడు. వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ పేరిట ఉన్న 49 సిక్సర్ల రికార్డును అధిగమించాడు.
ఈ ప్రపంచకప్ లో మొత్తం 28 సిక్సర్లు బాదిన రోహిత్.. న్యూజిలాండ్ తో జరిగిన సెమీస్ లో 4 సిక్సర్లు కొట్టాడు. 27 ఇన్నింగ్స్ ల్లో రోహిత్ 51 సిక్సర్లు సాధిస్తే.. 34 ఇన్నింగ్స్ ల్లో గేల్ 49 బాదాడు.