భారత్ లో జరగనున్న వన్డే క్రికెట్ ప్రపంచ కప్ షెడ్యూల్ ను ఐసీసీ విడుదల చేసింది. అక్టోబరు-నవంబరులో నిర్వహించే ఈ మెగా టోర్నీలో భాగంగా టీమిండియా… లీగ్ దశలో 9 మ్యాచ్ లు ఆడుతుంది. అక్టోబరు 8న ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచ్ ఆడనుండగా.. అహ్మదాబాద్ వేదికగా అక్టోబరు 15న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది.
హైదరాబాద్ లో మూడు మ్యాచ్ లు
నవంబరు 15న ముంబయిలో, నవంబరు 16న కోల్ కతాలో సెమీఫైనల్స్ జరుగుతాయి. అదే నెల 19న అహ్మదాబాద్ లో ఫైనల్ మ్యాచ్ ఉంటుందని ఐసీసీ ప్రకటించింది. రెండు సెమీఫైనల్స్ తోపాటు తుది పోరు కోసం రిజర్వ్ డేలు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ లో మూడు మ్యాచ్ లు నిర్వహిస్తుండగా… దేశంలోని 10 వేదికల్లో మొత్తం మ్యాచ్ లు జరుగుతాయి.
భారత్ మ్యాచ్ ల వివరాలు
- అక్టోబరు 8: ఆస్ట్రేలియాతో… వేదిక చెన్నై
- అక్టోబరు 11: అఫ్గానిస్థాన్ తో… వేదిక దిల్లీ
- అక్టోబరు 15: పాకిస్థాన్ తో… వేదిక అహ్మదాబాద్
- అక్టోబరు 19: బంగ్లాదేశ్ తో… వేదిక పుణె
- అక్టోబరు 22: న్యూజిలాండ్ తో… వేదిక ధర్మశాల
- అక్టోబరు 29: ఇంగ్లాండ్ తో… వేదిక లఖ్ నవూ
- నవంబరు 2: క్వాలిఫయర్-2తో… ముంబయి
- నవంబరు 5: దక్షిణాఫ్రికాతో… కోల్ కతా
- నవంబరు 11: క్వాలిఫయర్-1తో… బెంగళూరు