ప్రపంచకప్ అంటేనే భయపడి బేజారిపోయే దక్షిణాఫ్రికా.. ఎట్టకేలకు ధైర్యాన్ని ప్రదర్శించింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తు చేస్తూ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్(WTC)గా అవతరించింది. లార్డ్స్ లో జరిగిన ఫైనల్లో 282 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్ల తేడాతో గెలిచింది ‘గద’ను అందుకుంది. మార్ క్రమ్(136) అద్భుత సెంచరీకి కెప్టెన్ బవుమా(66) హాఫ్ సెంచరీ తోడవడంతో గెలుపు సులువైంది. 1998లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన సౌతాఫ్రికా.. 27 ఏళ్లకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ అయింది.