ఇప్పటికే భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పై నిషేధంతో దేశ క్రీడావని నివ్వెరపోతుంటే.. తాజాగా మరో రెజ్లర్ పైనా వేటు పడింది. అంతిమ్ పంఘాల్(Antim Panghal) పై మూడేళ్ల నిషేధం విధిస్తూ IOA(భారత ఒలింపిక్స్ కమిటీ) నిర్ణయం తీసుకుంది. అంతిమ్ తోపాటు సహాయ సిబ్బందిని వెంటనే స్వదేశం తిరిగి వెళ్లాల్సిందిగా ఆదేశించింది.
ఒలింపిక్స్ క్రీడా గ్రామంలోకి తన సోదరి నిషాను పంపించారంటూ పారిస్ ఒలింపిక్స్ అధికారులు.. IOA దృష్టికి తెచ్చారు. కచ్చితంగా పతకంతో తిరిగి వస్తుందని భావిస్తున్న అంతిమ్ పంఘాల్.. 53 కేజీల విభాగంవో టర్కీ రెజ్లర్ యెట్గిల్ జైనెప్ చేతిలో 10-0 తేడాతో పరాజయం పాలైంది.
తన బౌట్ లో ఓటమి తర్వాత కోచ్ తో సహా ఆమె హోటల్ కు వెళ్లిపోయింది. వస్తువులు(Items) తీసుకురావాల్సిందిగా సోదరి నిషాకు చెప్పడంతో ఆమె క్రీడా గ్రామంలోకి ఎంటరైంది. నిషా బయటకు వెళ్లిపోతున్న సమయంలో అధికారులు పట్టుకున్నారు. అంతిమ్ సోదరి స్టేట్మెంట్ ను రికార్డు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు తరలించారు.