భారత డాషింగ్ బ్యాటర్ యువరాజ్ సింగ్ కు పుత్రికోత్సాహం కలిగింది. రెండోసారి తండ్రి అయిన సంతోషాన్ని ఈ వెటరన్ క్రికెటర్… సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆయన సతీమణి హేజిల్ కీచ్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. గతేడాది యువీ-కీచ్ జంటకు అబ్బాయి పుట్టాడు. 2016లో యువరాజ్ సింగ్-హేజిల్ కీచ్ జంటగా ఒక్కటయ్యారు. ఇద్దరు పిల్లల్ని తల్లిదండ్రులు ఎత్తుకున్న ఫొటోల్ని షేర్ చేశారు.