గెలిస్తేనే సిరీస్ దక్కించుకునే ఆశలు(Hopes)న్న మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. 63 స్కోరు దాకా ఒక్క వికెట్టూ కోల్పోలేదు. కానీ ఆ తర్వాతే తడబాటు(Confusion)కు గురై 96కు చేరుకునేసరికి 4 వికెట్లు ఇచ్చేసుకుంది.
భారత్ ముందు భారీ టార్గెట్ ను ఉంచుతుందనుకున్న ఆతిథ్య జట్టు.. మధ్య ఓవర్లలో పెద్దగా పరుగులు రాబట్టలేకపోయింది.
ఓపెనర్లు రాణించినా…
ఓపెనర్లు మధేవ్రె(25), మర్మని(32) పట్టుదలగా క్రీజులో కుదురుకున్నారు. కానీ మర్మని ఔటయ్యాక బెనెట్(9) మరోసారి తక్కువకే వికెట్ పారేసుకున్నాడు. క్యాంప్ బెల్(3) బిష్ణోయ్ అద్భుత త్రోకు రనౌటయ్యాడు.
ఇలా నాలుగు వికెట్లు కూలడంతో కెప్టెన్ సికిందర్ రజా(46)నే భారం మోశాడు. చివరకు జింబాబ్వే 7 వికెట్లకు 152 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసింది.