సొంతగడ్డపై జింబాబ్వే క్రికెట్ జట్టు మంచి ప్రదర్శన చేసింది. హరారేలో జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆతిథ్య జట్టు.. బిష్ణోయ్ విజృంభణతో 9 వికెట్లకు 115 పరుగులు చేసింది. అనంతరం బ్యాటర్ల వైఫల్యం(Failure)తో 102 స్కోరుకే కుప్పకూలిన భారత్.. 13 రన్స్ తేడాతో ఓటమి పాలైంది.
ఆ జట్టు లాగే…
జింబాబ్వే టీంలో క్లైవ్ మదాండే(29), డియోన్ మయర్స్(23), బ్రెయిన్ బెనెట్(22), వెస్లీ మధ్వేర్(21) పరుగులు చేశారు. స్పిన్నర్ రవి బిష్ణోయ్ నాలుగు వికెట్లు తీశాడు. ఆ తర్వాత స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి గిల్ సేన కష్టాలు పడింది.
IPLలో అదరగొట్టిన అభిషేక్ శర్మ(0) డకౌటైతే.. రుతురాజ్(7), పరాగ్(2), రింకూ(0), జురెల్(6) వెంటవెంటనే వికెట్లు కోల్పోయారు. గిల్(31), వాషింగ్టన్(27), ఆవేశ్ ఖాన్(16) నిలబడాలని ప్రయత్నించినా గెలుపు దక్కలేదు. తెందయ్ చెతారా, కెప్టెన్ సికిందర్ రజా చెరో మూడు వికెట్లు తీసుకున్నారు.