రాష్ట్రంలో తమ పార్టీకి 90 నుంచి 100 స్థానాలు వస్తాయని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తమ సీఎం అభ్యర్థి ఎవరో భాజపా, కాంగ్రెస్ స్పష్టం చేయాలన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల స్ఫూర్తితో పనిచేసి భారాస విజయం సాధించింది. ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి పథాన సాగింది. ఎంఐఎం ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందనేది ఆ పార్టీ ఇష్టం. మతం ప్రాతిపదికనే ప్రజలు ఓట్లు వేస్తారనేది నేను నమ్మను. ప్రజలు అంతిమంగా మంచి ప్రభుత్వాన్నే ఎన్నుకుంటారని నమ్ముతున్నా అని కేటీఆర్ అన్నారు. సోషల్ మీడియాలో తప్ప రాష్ట్రంలో భాజపా లేనేలేదని, కాంగ్రెస్ మాతో పోటీ పడే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వస్తామనే భ్రమల్లో కాంగ్రెస్ ఉంటే అది వారి ఇష్టం. తాము కూడా అధికారంలోకి వస్తామని షర్మిల, కేఏ పాల్ చెబుతున్నారు. మంచి పనితీరు ఉన్న ఎమ్మెల్యేలందరికీ టికెట్లు వస్తాయని కేటీఆర్ స్పష్టం చేశారు.
Related Stories
December 22, 2024
December 21, 2024