బీసీల సంక్షేమం పేరిట ప్రభుత్వం ప్రారంభించిన రూ.లక్ష ఆర్థిక సాయం కోసం ఇప్పటివరకు 53 వేల దరఖాస్తులు అందాయి. చేతి, కులవృత్తుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలన్న లక్ష్యంతో ఈ పథకానికి సర్కారు శ్రీకారం చుట్టింది. ముడిసరుకులు, పరికరాల కొనుగోలుకు ఈ నిధులు ఉపయోగపడతాయని, కులవృత్తులు కలిగిన కుటుంబాలు ఈనెల 20 వరకు దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కోరారు. మొబైల్ ఫోన్ల ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా అందరికీ సులువైన రీతిలో అందుబాటులో ఉంచామని, అవసరమైన వారికి ఇన్ కం సర్టిఫికెట్లు అందజేయాలని కలెక్టర్లను ఆదేశించారు.