Published 30 Dec 2023
రాష్ట్రంలో పదో తరగతి(10th Class) పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 16 రోజుల పాటు షెడ్యూల్ కొనసాగనుండగా… తొమ్మిది రోజుల్లో ఎగ్జామ్స్ జరుగుతాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన కాసేపటికే షెడ్యూల్ విడుదల చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
షెడ్యూల్ ఇలా…
18-03-2024 – ఫస్ట్ లాంగ్వేజ్
19-03-2024 – సెకండ్ లాంగ్వేజ్
21-03-2024 – థర్డ్ లాంగ్వేజ్(ఇంగ్లిష్)
23-03-2024 – మాథమేటిక్స్
26-03-2024 – సైన్స్(పార్ట్-1 ఫిజికల్ సైన్స్)
28-03-2024 – సైన్స్(పార్ట్-2 బయోలాజికల్ సైన్స్)
30-03-2024 – సోషల్ స్టడీస్
01-04-2024 – సంస్కృతం & అరబిక్(OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1), SSC వొకేషనల్ కోర్సు(థియరీ)
02-04-2024 – సంస్కృతం & అరబిక్(OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2)