కుండపోత వర్షాలతో మెదక్(Medak) జిల్లాలోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. మోకాలి లోతు నీళ్లతో ప్రజలు అవస్థలు పడ్డారు. సంగారెడ్డి, కంగ్టి, జోగిపేట సహా అత్యధిక ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. జిల్లాకేంద్రంలో 17.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. బాలికల(Girls) జూనియర్ కాలేజీ నుంచి విద్యార్థినులు బయటకు రావడం కష్టమైపోయింది. మెదక్-హైదరాబాద్ హైవేపై నీరు చేరింది. పట్టణాలు చెరువుల్ని తలపించగా.. నీటిని ఎత్తిపోసేందుకు నానా అవస్థలు పడుతున్నారు.