Published 30 Dec 2023
రవాణాశాఖపై ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు ముగ్గురు ఉన్నతాధికారులకు స్థాన చలనం(Transfers) కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ముగ్గురు JTC(Joint Transport Commissioner)లుగా పనిచేస్తున్నారు. హైదరాబాద్ జేటీసీ జె.పాండురంగ్ నాయక్ ను మమతా ప్రసాద్ స్థానంలో JTC(అడ్మిన్)గా బదిలీ చేశారు. ఐటీ, విజిలెన్స్ JTCగా ఉన్న సి.రమేశ్ ను జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ గా పాండురంగ్ నాయక్ ప్లేస్ లోకి పంపించారు. ఇక అడ్మిన్ జేటీసీగా ఉన్న మమతా ప్రసాద్ ను సి.రమేశ్ స్థానంలో ఐటీ, విజిలెన్స్ JTCగా నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.
వెంటవెంటనే రెండు నిర్ణయాలు
రవాణాశాఖలో రెండు కీలక నిర్ణయాల్ని ప్రభుత్వం వెంటవెంటనే తీసుకుంది. డిపార్ట్ మెంట్ లో OD(On Deputation) విధానాన్ని రద్దు చేయడమే కాకుండా ముగ్గురు ఉన్నతాధికారులకు ట్రాన్స్ ఫర్ చేస్తూ ఆదేశాలిచ్చింది. దీన్ని బట్టి రానున్న రోజుల్లో ఈ డిపార్ట్ మెంట్ ను మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతో సర్కారు కనపడుతోంది.