పదిహేనేళ్ల నిరీక్షణకు తెరదించారన్న ఆనందం ఒకవైపు… ప్రకటించిన పోస్టింగ్స్ కోసం ఐదున్నర నెలలుగా ఎదురుచూపుల ఆవేదన మరోవైపు… ఇదీ 2008 DSC అభ్యర్థుల దీనగాథ. అభ్యర్థులందరికీ మినిమమ్ టైమ్ స్కేల్(MTS) పద్ధతిలో ఉద్యోగాలు ఇస్తూ మంత్రివర్గం(Cabinet) ఈ మార్చిలో నిర్ణయం తీసుకుంది. కానీ ఇప్పటిదాకా దీనిపై క్లారిటీ లేకపోవడంతో అభ్యర్థులు CM నివాసానికి చేరుకున్నారు.
CM ఇంటి వద్దకు రావడంపై 2008 DSC క్యాండిడేట్స్ వివరణ ఇచ్చారు. తమది ధర్నా కాదని, కేవలం సమస్యను విన్నవించడానికే ఇలా చేశామన్నారు. మార్చిలో కేబినెట్ నిర్ణయం వెలువడిన కొద్దిసేపటికే విధివిధానాల్ని(Guidelines) సైతం ఖరారు చేయాలని 2008 DSC సెలెక్టెడ్ మెరిట్ క్యాండిడేట్స్ అసోసియేషన్ ఆనాడు ప్రభుత్వాన్ని కోరింది. కానీ ఇప్పటిదాకా అది జరగకపోవడంతో అభ్యర్థుల్లో నిర్వేదం కనిపిస్తున్నది. అయితే మంగళవారం కోర్టు విచారణ ఉన్న దృష్యా కేబినెట్ సబ్ కమిటీ తన రిపోర్టును పూర్తి చేయాలని కోరుతున్నారు.
Correct