వానలు దంచికొడుతున్నాయి. ములుగు(Mulugu) జిల్లా మల్లంపల్లిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 21.6 సెంటీమీటర్లు నమోదైంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం బోర్నపల్లిలో 19.2, మెదక్ లో 18.4, రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గునెగల్ లో 18, యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలో 17.6, సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గరిడేపల్లిలో 17.1, కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తిలో 17 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది.