రాష్ట్రవ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురవడంతో భారీ వర్షపాతాలు నమోదవుతున్నాయి. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం అర్గొండ(Argonda)లో 31.9 సెంటీమీటర్లు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మెదక్ జిల్లా హవేలీఘనపూర్ మండలం నాగాపూర్ లో 20.8 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. హైదరాబాద్ జంట నగరాల్లో గత రాత్రి నుంచి ఇప్పటివరకు ఏకధాటిగా వాన పడుతూనే ఉంది.