సంఖ్యాశాస్త్రంలోని ప్రాథమిక విధానాలైన కూడికలు, తీసివేతలు, గుణకార, భాగహారాలను ఒకప్పుడు వేళ్ల మీద లెక్కబెట్టి ఠక్కున చెప్పేవారు. కానీ ఈ మాడ్రన్(Modern) యుగం(Era)లో కాలిక్యులేటర్ల వాడకం విపరీతంగా పెరగడం, అత్యాధునిక పద్ధతుల్లో వచ్చిన కంప్యూటర్ల ద్వారా లెక్కల్ని చెప్పేస్తున్నారు. తద్వారా మనిషికున్న స్వయం పరిజ్ఞానాన్ని క్రమంగా కోల్పోవాల్సి వస్తున్నది. ప్రస్తుత రోజుల్లో ‘అబాకస్’ విధానం ఒక పాతబడ్డ పురాతన వస్తువుగా భావిస్తున్నారు.
పురాతన కళ…
ఈ ‘అబాకస్’ను పిల్లలకు అలవాటు చేస్తే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, వినూత్న ఆలోచనలు(Creative Thinkings) పుట్టుకొస్తాయి. క్రీస్తు పూర్వ కాలంలో గ్రీకులు, బాబిలోనియన్లు ఈ ‘అబాకస్’ను ఉపయోగించే లెక్కలు కట్టేవారు. అలాంటి పురాతన విద్యను చిన్నారులకు పరిచయం చేయాలన్న ఉద్దేశంతో జగిత్యాల జిల్లాకు చెందిన గంగాధర్ అనే టీచర్ ఈ ఉచిత తరగతుల(Free Classes)కు శ్రీకారం చుట్టారు. ‘వరల్డ్ బెస్ట్ అబాకస్’ టీచర్ గా గుర్తింపు పొందిన గంగాధర్.. ఈ క్లాసుల్ని వివరిస్తారు. ‘ప్లే వే మెథడ్(Play Way Method)’ ఆధారంగా బాడీ మైండ్ కో-ఆర్డినేషన్ ద్వారా తరగతులు బోధిస్తారు.
ఎలాగంటే…
కాలిక్యులేటర్(Calculator) కంటే వేగంగా సంఖ్యాశాస్తాన్ని అవలీలగా చెప్పే ‘అబాకస్’ శిక్షణ తరగతులు ఈ నెల(ఏప్రిల్) 24 నుంచి ప్రారంభమవుతున్నాయి. 7 రోజుల పాటు సాగే ఈ ఆన్లైన్ ట్రెయినింగ్ కు 7-14 సంవత్సరాలు కలిగి 2-10వ తరగతి చదివే విద్యార్థులు అర్హులు. ఈ కోర్సు నేర్చుకోవాలంటే ముందుగా ‘ప్లే స్టోర్’ నుంచి ‘AAA ABACUS’ యాప్ ను డౌన్లోడ్(Download) చేసుకోవాల్సి ఉంటుంది. తరగతులు వినేందుకు వాట్సాప్ గ్రూప్ లింక్ కోసం 94404 44956 నంబరుకు విద్యార్థుల వివరాల్ని మెసేజ్ చేయాల్సి ఉంటుంది. మెసేజ్ చేసిన తర్వాత క్లాస్ లో జాయిన్ అవుతారని టీచర్ గంగాధర్ తెలిపారు.