కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి అకడమిక్ క్యాలెండర్ ను విద్యాశాఖ(Education Dept) ప్రకటించగా అందులో పండుగల సెలవుల్ని తెలియజేసింది. గతేడాది మాదిరిగానే దసరా సెలవుల్ని ఈసారి సైతం 13 రోజులు ఇచ్చింది. అంతకుముందు వరకు ఇది 14 రోజులుగా ఉండేది. అటు క్రిస్మస్ సెలవుల(Holidays)ను 5 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
లాస్ట్ వర్కింగ్ డే…
చివరి పనిదినాన్ని 2025 ఏప్రిల్ 23గా క్యాలెండర్ లో ప్రకటించింది విద్యాశాఖ. ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ 23 లాస్ట్ డే కాగా 24 నుంచి స్కూళ్లకు సెలవులు ఇచ్చారు.
దసరా…: అక్టోబరు 2 నుంచి 14 వరకు
క్రిస్మస్…: డిసెంబరు 23 నుంచి 27 వరకు
సంక్రాంతి…: 2025 జనవరి 13 నుంచి 17 వరకు
బడిబాట…: జూన్ 1 నుంచి 11 వరకు
పనిదినాలు…: 229 రోజులు