అవినీతి నిరోధక శాఖ(ACB) పేరిట ఉద్యోగులకు తప్పుడు(Fake) కాల్స్ వెళ్తున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ఫేక్ కాల్స్ ను నమ్మొద్దంటూ ACB డైరెక్టర్ జనరల్(DG) సి.వి.ఆనంద్ ఉద్యోగులకు సూచనలు చేశారు. ఎవరైనా కాల్స్ చేసి బెదిరిస్తే టోల్ ఫ్రీ నంబరు 1064కు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నారు.
ACB అధికారులమని చెప్పుకుంటూ వస్తున్న కాల్స్ కు భయపడి కొందరు ఉద్యోగులు డబ్బు కూడా చెల్లించినట్లు అధికారులు గుర్తించారు. కేసులు లేకుండా చూసేందుకు డబ్బులు డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగుల్ని భయపెడుతున్నారు. కాల్ చేసి డబ్బులు అడిగారంటేనే అది ఫేక్ అని తెలుసుకోవాలని DG స్పష్టం చేశారు.