విచారణకు రావాలంటూ మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(KTR)కు ACB నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ–కార్ రేస్ కు సంబంధించి ఇప్పటికే ఆయనపై కేసు నమోదు కాగా.. ఆయనకు నోటీసులు పంపించింది. ఈ నెల 6న ఉదయం 10 గంటలకు తమ ఎదుట హాజరు కావాలంటూ నోటీసుల్ని ACB పంపించింది. ఈ కేసులో కేటీఆర్ A1గా కేటీఆర్, A2గా సీనియర్ IAS అర్వింద్ కుమార్, A3గా బీఎల్ఎన్ రెడ్డి పేర్లు ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్లో భాగంగా తమ విచారణకు రావాలని KTRకు నోటీసులు జారీ అయ్యాయి.