రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ(Jobs Recruitments)ని సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని భావిస్తున్న కాంగ్రెస్ సర్కారు.. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లను పరిశీలించి వాటికి అనుబంధంగా మరిన్ని పోస్టులు చేర్చాలని నిర్ణయించింది. ఇప్పటికే ప్రకటించిన గ్రూప్-1 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ కు మరో 60 పోస్టులు జోడించాలని డిసైడ్ చేసింది. గతంలో 503 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడీ కొత్త పోస్టులతో కలిపి వీలైనంత త్వరగా ఇంకో నోటిఫికేషన్ ఇవ్వాలని TSPSCని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
ఆ పోస్టులివిగో…
ఈ కొత్త పోస్టుల్లో అత్యధికంగా DSP పోస్టులు 24 ఉండగా.. MPDOలు 19 ఉన్నాయి. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, జిల్లా పంచాయతీ అధికారులు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, జిల్లా రిజిస్ట్రార్ పోస్టుల్ని అదనంగా చేర్చారు. గతేడాది అక్టోబరు 16న గ్రూప్-1 ప్రిలిమినరీ నిర్వహిస్తే అది రద్దయింది. మరోసారి ప్రిలిమ్స్ చేపట్టినా హైకోర్టు ఆదేశాలతో అది కూడా క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. TSPSCకి నూతన టీమ్ ఏర్పడటంతో ఇక గ్రూప్-1ను వెంటనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాత 503 పోస్టులకు మరో 60 చేర్చి సాధ్యమైనంత త్వరగా ఇందుకు సంబంధించిన ప్రకటన ఇవ్వాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC)ని ఆదేశించింది.
Published 06 Feb 2024