
ఇంజినీరింగ్ డిపార్ట్ మెంట్లో పోస్టుల భర్తీకి మళ్లీ ఎగ్జామ్స్ నిర్వహించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC నిర్ణయించింది. AE, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేసింది. దసరా పండుగ సమయంలో ఈ ఎగ్జామ్స్ ను కండక్ట్ చేయాలని నిర్ణయించగా.. మూడు రోజుల పాటు వీటిని నిర్వహిస్తారు. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్ మెంట్ టెస్ట్(CBRT) పద్ధతిలో ఈ పరీక్షలు జరగనున్నాయి.
అక్టోబరు 18. 19 తేదీల్లో CBRT పద్ధతిలో సివిల్ ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహిస్తామని TSPSC తెలిపింది. అక్టోబరు 20న అదే విధానంలో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ పరీక్షలు జరుగుతాయి. ఇందుకు సంబంధించి ఈసారి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేసింది. పరీక్షకు వారం ముందు నుంచి వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంటుందని TSPSC ప్రకటించింది.