రాష్ట్రంలో కులగణన కోసం మరోసారి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తామని డిప్యూటీ CM మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇంతవరకు సర్వేలో వివరాలు నమోదు కాని వారి పేర్లు చేరుస్తామని తెలిపారు. కులగణన బిల్లును చట్టబద్ధం చేసి కేంద్రానికి పంపడమే తమ లక్ష్యమన్నారు. ఈ నెల 16 నుంచి 28వ తేదీ వరకు రీ-సర్వే(Re-Survey) ఉంటుందని, మొన్నటివరకు అనుసరించిన విధివిధానాల్నే(Guidelines) పాటిస్తామన్నారు. మొన్నటి సర్వేలో 3.1 శాతం కుటుంబాలు సర్వేకు దూరంగా ఉండిపోయాయని, అలాంటి వారు ఇప్పుడు పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు. 13 రోజుల పాటు సర్వే నిర్వహించాక ఆ వివరాల్ని మార్చి మొదటి వారంలో ప్రకటించనున్నారు. OBCలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు గాను సర్వేపై కేబినెట్ లో చర్చించాక శాసనసభలో తీర్మానం చేస్తామన్నారు.