హైదరాబాద్ లో కురుస్తున్న కుండపోత వర్షాలకు జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. హిమాయత్ సాగర్(Himayath Sagar), ఉస్మాన్ సాగర్ ప్రాజెక్టులకు భారీగా వరదనీరు వచ్చి చేరింది. కాసేపట్లో హిమాయత్ సాగర్ గేటు ఒక అడుగు మేర ఎత్తి నీటిని వదలనున్నారు. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలకు అలర్ట్ జారీ అయింది. నగర రోడ్లన్నీ చెరువుల్ని తలపించడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.