
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా ఫ్లడ్ వాటర్ వస్తున్నదని, ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. నీరు రిలీజ్ చేసే అవకాశం ఉన్నందువల్ల దిగువ ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండాలని SRSP అధికారులు సూచించారు. నది వైపు ఎవరూ వెళ్లొద్దని.. పశువులు, గొర్రెలను తీసుకెళ్లినవారు బయటకు రావాలని హెచ్చరించారు.