హైదరాబాద్ లో జరిగే గణేశ్ నిమజ్జన వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతున్నారు. 6న మధ్యాహ్నం 2 గంటలకు ఆయన ఎం.జె.మార్కెట్లోని వినాయక్ చౌక్ లో ప్రసంగిస్తారు. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి వేడుకల్లో పాల్గొంటారు. 1980లో మొదలైన గణేశ్ ఉత్సవ సమితి.. 46 ఏళ్ల ఉత్సవాల్ని నిర్వహిస్తోంది. ఆగస్టు 27న సామూహిక ఉత్సవాలు జరిపిన సంస్థ.. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. గణేశ్ ఉత్సవాల్ని ఘనంగా, ప్రశాంతంగా నిర్వహిస్తుంటుంది. అమిత్ షాతోపాటు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, ఉత్తరాది మఠ్ స్వామీజీ సత్యాత్మ తీర్థ, రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద హాజరవుతారు.