
ప్రముఖ కవి అందెశ్రీ అంత్యక్రియలు(Andesri) పూర్తయ్యాయి. ఘట్ కేసర్ లో అధికారిక లాంఛనాలతో చివరి ఘట్టం పూర్తయింది. CM రేవంత్ హాజరై పాడె మోశారు. పలువురు మంత్రులు సైతం హాజరై నివాళులు అర్పించారు. అంతిమఘట్టం కోసం అందెశ్రీ అభిమానులు, శ్రేయోభిలాషులు, కవులు, కళాకారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శ్రద్ధాంజలి ఘటించారు. ఇక అంతిమయాత్ర ర్యాలీలో భారీ సంఖ్యలో జనం పాల్గొన్నారు.