
అందెశ్రీ(Andesri) అంత్యక్రియల్ని పోలీసు లాంఛనాలతో పూర్తి చేయాలని CM రేవంత్ ఆదేశించారు. ఈ బాధ్యతల్ని మంత్రి వాకిటి శ్రీహరికి అప్పగించారు. ఆయన కుటుంబ సభ్యుల్ని శ్రీహరి
పరామర్శించారు. ఉదయం 7:20 గంటలకు అందెశ్రీని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే గుండెపోటుతో ఆయన కన్నుమూశారని డాక్టర్లు తెలిపారు. ఘట్ కేసర్ లో రేపు అంత్యక్రియలు జరుగుతాయి. ‘జయ జయహే తెలంగాణ’, ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు’ వంటి హిట్ సాంగ్స్ తో ప్రాచుర్యం పొందారు అందెశ్రీ.