ఆరు నెలల్లోనే తెలంగాణకు రెండు ఎయిర్ పోర్టుల అనుమతులు వచ్చాయి. ఆదిలాబాద్(Adilabad) విమానాశ్రయానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే వాయుసేన శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పే అవకాశాలున్నట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) తెలిపింది. జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ కాలనీకి ఆనుకుని 362 ఎకరాల భూమి ఉంది. రన్ వే, టెర్మినల్స్ సహా మౌలిక సదుపాయాలు(Infrastructures) చేపట్టాలంటూ ప్రభుత్వం కోరింది. 2013-14లోనే 1,500 ఎకరాల భూమికి సర్వే పూర్తయింది. ఈ కొత్త విమానాశ్రయ NOCకి గాను పూర్తి వివరాలు సమర్పించాలని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI)ని ఆదేశించింది. AAIతో కలిసి దీన్ని IAF అభివృద్ధి చేయనుంది. ఈ మధ్యకాలంలోనే వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టుకు లైన్ క్లియర్ అయింది.