మరిన్ని ఉద్యోగ పరీక్షలకు సంబంధించిన ఫలితాల్ని(Results) రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) విడుదల చేసింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ కు సంబంధించిన పరీక్షల రిజల్ట్స్ ను ప్రకటించింది. ఇప్పుడు ప్రకటించిన వాటిలో అకౌంట్ ఆఫీసర్లు(AO), జూనియర్ అకౌంట్ ఆఫీసర్లు(JAO), సీనియర్ అకౌంటెంట్ పోస్టులు ఉన్నాయి.
ఈ ఉద్యోగాల కోసం 2023 ఆగస్టులో ఎగ్జామ్స్ నిర్వహించగా.. ఆరు నెలల తర్వాత వాటి ఫలితాల్ని వెల్లడించింది TSPSC. మొత్తం 12,186 మంది అభ్యర్థుల ర్యాంకుల్ని ప్రకటించి.. సెలెక్ట్ అయిన వారి లిస్టును సర్టిఫికెట్ల పరిశీలనకు పరిగణలోకి తీసుకుంటారు.