నాలుగు ప్రభుత్వ పథకాల(Schemes)కు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు నిర్వహిస్తున్న గ్రామ సభలకు పెద్దయెత్తున స్పందన వస్తోంది. ఈరోజు నుంచి మొదలైన గ్రామ, వార్డు సభలు ఈనెల 24 వరకు కొనసాగుతాయి. కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆయా గ్రామ సభలకు రోజువారీ షెడ్యూల్ ను కేటాయించిన మండలాధికారులు.. నిత్యం కొన్ని గ్రామాల చొప్పున చుట్టివస్తున్నారు. అప్లికేషన్లు తీసుకున్న అనంతరం గ్రామ, వార్డు సభల్లోనే లబ్ధిదారుల(Beneficieries)ను ఎంపిక చేయబోతున్నారు. ఈ నెల 26 నుంచి కొత్త స్కీములు అమలు చేస్తామని ఇంతకుముందే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అర్హత ఉండి పేర్లు లేని వారు ఈ సభల్లో దరఖాస్తులు ఇవ్వాల్సి ఉంటుంది.