317 జీవో కింద కేబినెట్ సబ్ కమిటీ పరిశీలనకు వచ్చిన దరఖాస్తులు భారీ సంఖ్యలో ఉన్నాయి. వెబ్ పోర్టల్ ద్వారా అందిన అప్లికేషన్లు మొత్తం 52,235 ఉన్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. ఇందులో ఉపాధ్యాయులవే 21,074(పాఠశాల విద్య 20,209, ఉన్నత విద్య 865)తో ప్రథమ స్థానంలో ఉండగా.. హోం డిపార్ట్మెంట్ 11,417 అప్లికేషన్లలో సెకండ్ ప్లేస్ లో నిలిచింది.
18న మరోసారి…
ఇప్పటికే నాలుగు సార్లు సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం.. ఈనెల 18న ఐదోసారి భేటీ కానుంది. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో మిగతా సభ్యులైన మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తో ఈ భేటీ జరగనుంది. స్వీకరించిన అప్లికేషన్లను శాఖాధిపతుల(HOD’s)కు చేరవేసిన సాధారణ పరిపాలన శాఖ(GAD).. ఈ నెల 16లోపు వాటి పరిశీలన పూర్తి చేయాలని ఆదేశించింది.
ప్రధాన డిపార్ట్మెంట్లకు వచ్చిన దరఖాస్తులు ఇలా…
డిపార్ట్మెంట్ | స్పౌజ్ | మెడికల్ | మ్యూచువల్ | సీజీ స్పౌజ్ | లోకల్ | ఇతరులు | మొత్తం |
పాఠశాల విద్య | 3,033 | 399 | 203 | 165 | 11,271 | 5,138 | 20,209 |
హోం | 392 | 330 | 300 | 16 | 7,351 | 3,028 | 11,417 |
వైద్యారోగ్యం | 317 | 268 | 45 | 51 | 2,356 | 1,796 | 4,833 |
రెవెన్యూ | 216 | 102 | 63 | 15 | 1,481 | 799 | 2,676 |
పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి | 177 | 94 | 56 | 8 | 1,415 | 640 | 2,390 |
సోషల్ వెల్ఫేర్ | 158 | 44 | 38 | 20 | 1,175 | 362 | 1,797 |
పర్యావరణ, అటవీ, సైన్స్& టెక్నాలజీ | 82 | 51 | 52 | 8 | 732 | 310 | 1,235 |
ట్రైబల్ వెల్ఫేర్ | 111 | 36 | 23 | 8 | 650 | 312 | 1,140 |
ఉన్నత విద్య | 57 | 25 | 11 | 15 | 564 | 193 | 865 |