2008 DSC అభ్యర్థుల పదహారేళ్ల కల ఫలించింది. నిరసనలు, అభ్యర్థన(Requests)లు, న్యాయపోరాటాలతో చివరకు అనుకున్నది సాధించారు. మొత్తం 1,382 మంది ఉద్యోగాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు(Orders) జారీ చేసింది. మూడు రోజుల్లోగా నియామకాలు చేపట్టాలంటూ ఈ నెల 10న హైకోర్టు విస్పష్ట తీర్పునిచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారులు.. ఉద్యోగాల నియామక ప్రక్రియను పూర్తి చేశారు. అభ్యర్థులను వెరిఫై చేసి జిల్లాల వారీగా పోస్టులు కేటాయించాలంటూ అన్ని జిల్లాల కలెక్టర్లు, DEOలకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఇ.వి.నర్సింహారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.