నిజామాబాద్ పీఎఫ్ఐ ఉగ్రవాద కుట్ర కేసులో కీలక నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అరెస్టు చేసింది. రాష్ట్రం వదిలి పారిపోయినా, పేరు మార్చుకున్నా, కొత్త పనిలో చేరినా.. ఎన్ఐఏ కళ్లుగప్పలేకపోయాడు. 9 నెలలుగా తప్పించుకు తిరుగుతున్న నొసాన్ మహ్మద్ యూనస్(33) ఎట్టకేలకు అరెస్టయ్యాడు. ఏపీ నుంచి పారిపోయి కర్ణాటకలో తలదాచుకున్న అతడిని చాకచక్యంగా పట్టుకున్నారు పోలీసులు. మత విద్వేషాలు రెచ్చగొట్టి ఒక వర్గంపై దాడులకు పాల్పడేలా కుట్ర పన్నాడంటూ నిజామాబాద్ పోలీసులు 2022 జులైలో కేసు నమోదు చేశారు.
16 మంది అరెస్టు
ఉగ్ర కుట్ర కేసులో ఎన్ఐఏ ఇప్పటివరకు 16 మందిని అరెస్టు చేసింది. పీఎఫ్ఐ తరఫున యూనస్.. యువతకు సాయుధ, ఆయుధ శిక్షణ ఇచ్చినట్లు గుర్తించింది. ఒక మతానికి సంబంధించిన రాజ్యాన్ని భారత్ లో స్థాపించడమే లక్ష్యంగా కుట్ర జరిగిందని ఛార్జిషీట్ నమోదు చేసింది.