రాష్ట్రంలో 10 మంది అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ASP)లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తా ఆర్డర్స్ రిలీజ్ చేశారు. బి.కోటేశ్వర్ రావు(వెయిటింగ్)ను ఎల్బీనగర్ అడిషనల్ DCPగా.. సయ్యద్ రఫీక్(వెయిటింగ్)ను రాచకొండ స్పెషల్ బ్రాంచ్(SB) అడిషనల్ DCPగా.. పులిచింతల శ్రీనివాస్ రెడ్డి(వెయిటింగ్)ని GHMC ఎన్ఫోర్స్ మెంట్, విజిలెన్స్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ASPగా.. ఎస్.సురేందర్ రెడ్డిని DGP ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
ఎన్.మహేందర్ CID ASPగా.. ఎం.డి.ఫజ్లుర్ రహ్మాన్(వెయిటింగ్)ను విజిలెన్స్, ఎన్ఫోర్స్ మెంట్ ASPగా.. బి.సురేందర్ రావు(వెయిటింగ్)ను విజిలెన్స్, ఎన్ఫోర్స్ మెంట్ ASPగా.. బి.ఆనంద్ ను హైదరాబాద్ CTC అడిషనల్ DCPగా.. మహ్మద్ ఇక్బాల్ సిద్ధిఖీ(వెయిటింగ్)ని మేడ్చల్ అడిషనల్ DCPగా.. వి.శ్యాంబాబు(వెయిటింగ్)ను ట్రాన్స్ కో ASP(డిప్యుటేషన్)గా బదిలీ చేశారు.