అక్రమంగా కట్టిన నిర్మాణాల్ని కూల్చుకుంటూ వస్తున్న హైడ్రా అధికారులు.. ఇప్పటివరకు సాగించిన పరిణామాలపై సర్కారుకు నివేదిక ఇచ్చారు. మొత్తం 18 ప్రాంతాల్లో కూల్చివేతలు జరిపినట్లు తెలిపారు. అందులో వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు, బడా వ్యాపారులు, సినీ, క్రీడా దిగ్గజాలు ఉన్నారు. వీటి ద్వారా 43.94 ఎకరాల ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకున్నట్లు రిపోర్టులో వివరించారు.
అక్కినేని నాగార్జున, ప్రొ.కబడ్డీ యజమాని అనుపమ, MIM ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్, ఆ పార్టీ MLC మహ్మద్ మీర్జా, కాంగ్రెస్ సీనియర్ నేత పళ్లంరాజు సోదరుడు పళ్లం ఆనంద్, కావేరి సీడ్స్ భాస్కర్ రావు, మంథని BJP నాయకుడు సునీల్ రెడ్డి నిర్మాణాల్ని కూల్చివేసి భూముల్ని కాపాడినట్లు నివేదిక అందజేశారు.