వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తును వేగవంతం చేసింది. ఇప్పటికే అధికారుల్ని బదిలీ చేసి, RO, AROల నియామకాలు చేపట్టిన S.E.C. నేటి నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుంది. EVM, వీవీప్యాట్లపై ఈ అవగాహన కార్యక్రమం కొనసాగుతుంది. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా అధికారులు పాల్గొంటారు.