అస్వస్థతకు గురైన ముఖ్యమంత్రి కేసీఆర్ కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని మంత్రి KTR తెలిపారు. CM ఆరోగ్యంపై స్పందించిన ఆయన.. కేసీఆర్ కు ఇప్పటికే వైరల్ ఫీవర్ ఉందని గుర్తు చేశారు. ఛాతీ(Chest)లో సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందని తెలిపిన కేటీఆర్.. ఆయన కోలుకోవడానికి మరింత టైమ్ పడుతుందన్నారు. గత 15 రోజుల నుంచి కేసీఆర్ అనారోగ్యంతో ఉండగా.. తొలుత వైరల్ ఫీవర్ అని ఆయన తనయుడు ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ KTRతోపాటు మరో మంత్రి హరీశ్ రావు రాష్ట్రవ్యాప్తంగా టూర్లు పెట్టుకుంటున్నారు. సెగ్మెంట్ల వారీగా సభలకు అటెండ్ అవుతూ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని కోరుతున్నారు.
కేసీఆర్ ఎప్పుడొస్తారా అని…
తనయుడు, అల్లుడు పెద్దయెత్తున కార్యక్రమాలకు హాజరు అవుతుండటం, మరోవైపు సీఎం సమాచారం బయటకు రాకపోవడంతో అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఇన్ని రోజులుగా సీఎం కోలుకోకపోవడానికి కారణం ఏమై ఉంటుందన్నది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలే ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందన్న తరుణంలో కేసీఆర్ అస్వస్థతకు గురి కావడం, మంత్రులిద్దరూ విస్తృతంగా పర్యటనలు చేపట్టడంతో ముఖ్యమంత్రి మళ్లీ ప్రజల్లోకి ఎప్పుడొస్తారా అన్న చర్చ నడుస్తున్నది. ఇలా పార్టీ శ్రేణులు, అభిమానుల సంశయాన్ని తీరుస్తూ మంత్రి KTR స్పందించారు. కేసీఆర్ కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని తెలిపారు.