
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్లలో కాంగ్రెస్, BRS నేతలు గుత్తా అమిత్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. సర్దిచెప్పి పోలీసులు అక్కణ్నుంచి పంపించివేశారు. అదే జిల్లా కేతేపల్లి
మండలం కొర్లపహాడ్ వద్ద ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. నారాయణపేట జిల్లా సర్జఖాన్ పేటలో డబ్బు, మద్యం పంచుతున్నారని గొడవ జరిగింది.
పంచాయతీ పోలింగ్ లో విచిత్రమైన సంఘటన బయటపడింది. దీంతో ఓటింగ్ నే కొద్దిసేపు నిలిపివేయాల్సి వచ్చింది. బ్యాలెట్ పేపర్లో వార్డు సభ్యుడి పేరు ఒకరిది లేకపోవడంతో నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కుప్పగండ్ల 10వ వార్డులో గందరగోళం ఏర్పడింది. మొత్తం నలుగురు అభ్యర్థులకు గాను ముగ్గురు పేర్లే ఉండటంతో సమస్య వచ్చింది. మరో బ్యాలెట్ పేపర్ రాగానే పోలింగ్ ప్రారంభమైంది. కానీ అప్పటికే గంటన్నర సమయం వృథా అయింది.