

25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, వారంతా బీజేపీలోకి రావాలంటే పదవులకు రాజీనామా చేయాల్సిందేనని కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ బహిరంగసభలో మాట్లాడారు. ధరణి వల్ల లాభపడింది కేసీఆర్ కుటుంబమేనన్న ఆయన.. సీఎం వేసిన శిలాఫలకాలతో ఉస్మానియా హాస్పిటల్ కట్టవచ్చన్నారు. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని, ఇప్పటివరకు ఎందరికో అవకాశమిచ్చారు.. ఒక్కసారి తమకు ఇవ్వండని ప్రజలను సంజయ్ కోరారు. పేదల పక్షాన నిలిచే ప్రభుత్వం కావాలో, గడీల ప్రభుత్వం కావాలో తేల్చుకోవాలన్నారు. అవినీతికి పాల్పడిన కేసీఆర్ సహా అందరినీ డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పడ్డ తర్వాత జైలుకే పంపిస్తామన్నారు. లిక్కర్ స్కాంతో కేసీఆర్ అవినీతి తారస్థాయికి చేరిందని సంజయ్ విమర్శించారు.