బీసీ రిజర్వేషన్ల(BC Reservations) ఆర్డినెన్స్ గవర్నర్ చెంతకు చేరింది. పంచాయతీరాజ్ చట్టసవరణ ఆర్డినెన్స్(Ordinance)ను రాజ్ భవన్ కు రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. రిజర్వేషన్లు అమలయ్యాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని ఈ మధ్యనే ప్రకటించింది. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో BCలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపింది. అక్కడ పెండింగ్ లో ఉండగా.. గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారానే ఆ పని పూర్తిచేయాలని ఈనెల 10న కేబినెట్ నిర్ణయించింది. అనుకున్నట్లుగానే అది గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కార్యాలయానికి చేరింది. మరిన్ని వార్తలకు క్లిక్ చేయండి…: https://justpostnews.com