
BC రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు(High Court)లో పోటాపోటీ వాదనలు నడుస్తున్నాయి. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పలు అంశాల్ని ప్రస్తావించారు. కులగణన సర్వే పారదర్శకంగా లేదని, రిజర్వేషన్ల పరిమితి 50% దాటకూడదని వాదించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. పెంపు అధికారం సర్కారుకు ఉన్నా సుప్రీంకోర్టు తీర్పు మేరకు పరిమితి 50% దాటకూడదన్న రూల్ ను ప్రభుత్వం ఉల్లంఘించిందని గుర్తు చేశారు. మహారాష్ట్రలోనూ ఇలాగే జరిగితే సుప్రీం కొట్టివేసిందన్నారు. తాజా 42%తో మొత్తం రిజర్వేషన్లు 67 శాతానికి చేరాయన్నారు.